టీమిండియా స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ వరుసగా రెండు మ్యాచ్‌లలో డకౌట్ కావడాన్ని భారత మాజీ క్రికెటర్లు తప్పుపడుతున్నారు. గిల్‌కు చిన్న వయసులో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి బిసిసిఐ పెద్ద పొరపాటే చేసిందని ఆకాశ్ చోప్రా, మహ్మద్ కైఫ్, శ్రీకాంత్, అశ్విన్ వంటి మాజీ క్రికెటర్లు విమర్శించారు. గిల్ ఇలాగే ఆడితే టీమిండియాకు ఇబ్బందులు ఖాయమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా గిల్ తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచడంలో విఫలమవుతున్నాడని, ఇది భారత క్రికెట్ మంచి పరిణామం కాదని పేర్కొన్నారు.

