ిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం స్పిరిట్‌తో ప్రముఖ న్యూరోఫిజిషియన్ డాక్టర్ చంద్రశేఖర్ పాతకోటి, ఆయన సతీమణి డాక్టర్ ప్రణయవాణి పేదింటికి చెందిన ప్రతిభావంతురాలైన విద్యార్థిని సుస్మిత వైద్య విద్య కోసం లక్ష రూపాయల చెక్కును విరాళంగా అందజేసి స్ఫూర్తిదాయకంగా నిలిచారని అన్నారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా తిరుమలగిరి తండాకు చెందిన ప్రతిభావంతమైన నిరుపేద విద్యార్థి చంద్రశేఖర్ చదువుల కోసం వ్యాపారవేత్త నాయిని వెంకటేశ్వర రెడ్డి ల్యాప్‌టాప్, లక్ష రూపాయల చెక్కును అందజేశారని చెప్పారు.

