
మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు తీర్పును సస్పెండ్ చేస్తూ బెయిల్ మంజూరు చేసింది. రూ.10 లక్షల పూచీకత్తుతో పాటు పాస్‌పోర్ట్ సరెండర్ చేయాలని ఆదేశించింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని షరతు విధించింది. గతంలో సీబీఐ కోర్టు గాలికి ఏడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.