ఇండోర్ లో కలుషిత నీటి వల్ల పలువురు మృతి చెందిన ఘటన మరువక ముందే గుజరాత్ లోని గాంధీనగర్లో కూడా కలుషిత నీరు తాగి పలువురు అనారోగ్యం పాలయ్యారు. కలుషిత నీటి కారణంగా టైఫాయిడ్ కేసులు పెరుగుతున్నాయి. అక్కడి సివిల్ హాస్పిటల్ లో వంద మందికి పైగా పిల్లలు, పలువురు పెద్దలు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం కలుషిత నీరు తాగిన బాధితుల కోసం గాంధీ నగర్ సివిల్ హాస్పిటల్లో ప్రత్యేక వార్డునే ఏర్పాటు చేశారంటే పరిస్థతి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

