
గుంటూరు జిల్లాలో ఓ ఉద్యోగి నిర్వాకంపై తోటి సిబ్బంది మండిపడుతున్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేసే ఆఫీసర్ ఒకరు.. సిబ్బందికి సంబంధించిన వాట్సాప్ గ్రూపులో అశ్లీల ఫోటోలను పోస్ట్ చేశారు. అవి కూడా మెప్మాలో రిసోర్స్ పర్సన్‌గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని ఫోటోలు. ఈ ఫోటోలు చూసిన సిబ్బంది షాక్ తిన్నారు. వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా.. అతగాడిని వేరేచోటుకు బదిలీ చేశారు.
తిరిగి గుంటూరుకు రాకుండా చూడాలని..అలాగే కఠిన చర్యలు తీసుకోవాలని మెప్మాలోని మహిళా ఉద్యోగులు కోరుతున్నారు.