
గద్దర్ అవార్డులపై స్పందించారు నటుడు అల్లు అర్జున్. ఉత్తమ నటుడిగా ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నాఅంటూ ట్వీట్ చేశారు.తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. తనకు అవార్డు రావడం వెనుక క్రెడిట్ అంతా సుకుమార్, నిర్మాతలదే అన్నారు . గద్దర్ అవార్డును అభిమానులకు అంకితం చేస్తున్నా అన్న అల్లు అర్జున్…అభిమానులు చూపించే ప్రేమ, మద్దతు.. తనలో స్ఫూర్తిని నింపుతూనే ఉంటాయన్నారు. అలాగే గద్దర్ అవార్డులకు ఎంపి అయిన అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్.