
ట్రంప్ టారిఫ్ దెబ్బకు ఐఫోన్ల ప్రియంకాబోతున్నాయి. ఆయా మాడళ్ల ధరలు 30 శాతం నుంచి 43 శాతం వరకు పెరగనున్నాయి. వీటిలో హై-ఎండ్ మాడల్ 2,300 డాలర్లు అధికంకాబోతున్నదని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ప్రత్యేక కథనాన్ని ప్రచూరించింది. ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న ఐఫోన్లలో అత్యధికంగా చైనా లో తయారవుతుండటమే ఇందుకు కార ణం. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన 799 డాలర్ల విలువైన ఐఫోన్ 16 ధర 1,142 డాలర్లకు చేరుకోనున్నది.