వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి నేనే పోటీ చేస్తా&, నా గెలుపును బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అడ్డుకోగలరా ?” అని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు, రేణుకా చౌదరి ప్రశ్నించారు.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ
ఉపాధి హామీ పథకం పేరును ‘విబి జి రామ్ జి’గా మార్పు చేయడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం తెలిపారు. మహిళలు ఎటువంటి దుస్తులు ధరించాలన్నది చెప్పేందుకు ఎవరికీ అధికారం లేదన్నారు. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛపై పిచ్చిగా ఎవరు మాట్లాడినా సహించేది లేదని ఆమె హెచ్చరించారు.

