జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని మర్చిపోక ముందే.. పాక్ లెజెండ్స్‌తో భారత మాజీ క్రికెటర్లు మ్యాచ్ ఆడటంపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది బీసీసీఐని తప్పుబట్టారు. ఉగ్రదాడి బాధితుల కుటుంబాలు శోకసంద్రంలో ఉంటే.. మ్యాచ్‌లు నిర్వహించడం నైతిక దివాలాకోరుతనం అవుతుందని ఆమె విమర్శించారు. ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. ఇలాంటి చర్యలకు ఎలా అనుమతిస్తుందని ప్రశ్నించారు. ఇది దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని ఆమె అన్నారు.

