నందమూరి బాలకృష్ణ అఖండ 2 తాండవం ఫస్ట్ సింగల్ విడుదల సందర్భంగా ముంబై లో ఒక ఈవెంట్లో డైరెక్టర్ బోయపాటి కేవలం 130 రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేసారంటూ టాలీవుడ్ డైరెక్టర్ల మీద సెటైర్లు కూడా వేసాడు. ఇప్పటి డైరెక్టర్లు బోల్డంత ఖర్చు చేస్తూ, రోజుల తరబడి షూటింగ్లు చేస్తున్నారంటూ కామెంట్ చేసాడు. ఈ సెటైర్ ఇప్పటి తరంలో కొంతమంది దర్శకులను ఉద్దేశించే అనే చర్చమొదలైయింది. అదిగో బాలయ్య పలానా డైరెక్టర్ నే అన్నాడంటూ అప్పుడు సోషల్ మీడియాలో కామెంట్లు కూడా మొదలయ్యాయి.

