ప్రపంచవ్యాప్తంగా పేరొందిన క్వీన్స్ కామన్వెల్త్ ఎస్సే కాంపిటీషన్ (QCEC)–2025లో విజేతలలో ఒకరిగా నిలిచి తెలుగు సమాజానికి గర్వకారణంగా మారింది ఆచంట లక్ష్మీ మనోజ్ఞ. చిన్న వయసులోనే వసుధైవ కుటుంబకమ్” అనే సార్వకాలిక–సార్వజనీన దృక్పథాన్ని తన కవిత్వంలో ప్రతిబింబిస్తూ, వలసవాద ధోరణులను ప్రశ్నించే సాహిత్య దృష్టిని ఆవిష్కరించడం ఆమె ప్రతిభకు నిదర్శనం. సింగపూర్‌లోని Crescent Girls’ Schoolలో సెకండరీ–2 చదువుతున్న మనోజ్ఞ.. చదువుతో పాటు సంగీతం, సాహిత్యం, పియానో, నృత్యం వంటి అనేక రంగాల్లో తన ప్రజ్ఞను వికసింపజేస్తోంది.

