అంతర్జాతీయ రాజకీయాల్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల వల్ల ప్రపంచ చమురు మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. అమెరికా మరియు ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత కీలకమైన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 15 శాతం పడిపోయి 92.67 డాలర్లకు చేరుకుంది. ఇక అమెరికాకు చెందిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 20 డాలర్ల మేర క్షీణించి 94.87 డాలర్ల వద్ద స్థిరపడింది.

