తిరుపతి నగర కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. సమావేశంలోకి బయట వ్యక్తి లోపలి కొచ్చి వైసిపి సభ్యుడిపై దాడి చేశాడు. కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ ఎస్.కె. బాబు, గణేష్ మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఇదే సమయంలో బయటకు కౌన్సిల్ లోకి దూసుకొచ్చి వైసిపి కార్పొరేటర్ గణేశ్ పై దాడికి పాల్పడ్డాడు. దీంతో కౌన్సిల్ సాక్షిగా కార్పొరేటర్ ఎస్.కె.బాబు క్షమాపణ చెప్పాడు. వైసిపి కార్పొరేటర్ గణేష్ కుమార్ పై దాడి ఘటనలో ఎస్ వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కేస నమోదైంది.

