విజయ్ హజారే ట్రోఫీక్రికెట్ మ్యాచ్‌లను బెంగుళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించాల్సి ఉంది. కానీ రేపటి నుంచి జరగాల్సిన మ్యాచ్ వేదికను అకస్మాత్తుగా మార్చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా, కర్నాటక ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వలేదు. ఢిల్లీ, ఆంధ్ర మధ్య మ్యాచ్ జరగాల్సి ఉన్నది. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో ఆడేందుకు విరాట్ కోహ్లీ సిద్దంగా ఉన్నారు. కానీ ఆయన అభిమానులకు నిరాశే మిగలనున్నది.

