2026 నూతన సంవత్సరాన్ని టీమిండియా విజయంతో ఘనంగా ప్రారంభించింది. బరోడా క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. 301 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు, ఆరంభంలో తడబడినప్పటికీ, సీనియర్ బ్యాటర్ల అనుభవం, యువ ఆటగాళ్ళ పోరాట పటిమతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది.

