భారత ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి సెంట్రల్ కాంట్రాక్టులో BCCI షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2024-25 సంవత్సరానికి బీసీసీఐ ప్రకటించిన వార్షిక కాంట్రాక్టుల్లో వీరిద్దరినీ ఏ ప్లస్ గ్రేడ్ నుంచి బీ గ్రేడ్‌కు డిమోట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో వీరి వార్షిక వేతనం రూ.7 కోట్ల నుంచి రూ.3 కోట్లకు తగ్గనుంది. టి20, వన్డే, టెస్టులు ఆడేవారిని మాత్రమే ఏ ప్లస్ గ్రేడ్‌లో ఉంచే నిబంధన ప్రకారం, కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న కోహ్లి, రోహిత్‌లకు ఈ కోత విధించినట్లు తెలుస్తోంది.

