
కోవిడ్19 నుంచి కోలుకున్నానని, ఇప్పుడు బాగున్నానని నటి శిల్పా శిరోద్కర్ గురువారం తెలిపింది. 51ఏళ్లున్న ఆమె ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ‘చివరికి కోలుకున్నా, ఇప్పుడు బాగున్నా, మీరు కనబరిచిన ప్రేమకు థ్యాంక్స్,
గురువారం ఆనందంగా ఉంది’ అంటూ బాంద్రావోర్లీ సీ లింక్‌లో కారు నుంచి ఓ ఫోటో కూడా పెట్టింది. మాస్క్‌లు ధరించమని, సురక్షితంగా ఉండమని ఆమె తన ఫాలోయర్లని కోరింది.