సింగరేణిలో అవినీతి వెలికితీశాక పాలకుల్లో వణుకు మొదలైందని. తెలంగాణ సీఎం కోల్ మాఫియాకు నాయకుడిలా మారిపోయారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నేతలు బొగ్గు గనుల కేటాయింపులపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఫిర్యాదు చేశారు. ఏ బొగ్గుగనిలో లేని నిబంధన సైట్ విజిట్ సర్టిఫికేషన్ విధానం ఎందుకు పెట్టారు…? ఎవరికి లాభం చేయడానికి పెట్టారు. అంటే ఇంతవరకు ప్రభుత్వంలోని బాధ్యులు ఏ ఒక్కరూ కూడా సమాధానం చెప్పడం లేదన్నారు కేటీఆర్ .

