ప్రముఖ అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ భారత్ వచ్చేశారు. మొదటగా కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. ఉదయం తెల్లవారుజాము 3:30 గంటల సమయంలో ఆయన ప్రత్యేక విమానంలో వచ్చారు.మెస్సీ కోల్‌కతాలో ల్యాండ్ అయ్యారు అనే విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఎయిర్‌పోర్ట్ లోపలికి ఒక్కసారిగా పరుగులు తీసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 14 ఏళ్ల తర్వాత భారత్‌కు ఆయన రావడం ఇదే మొదటిసారి.

