చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరైన తండ్రీకొడుకులను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేసిన ఘటన నర్సరావుపేటలో జరిగింది. వీరస్వామిరెడ్డి ఆయన కుమారుడు ప్రశాంత్ రెడ్డి బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూంటారు. కేసులో విచారణకు హాజరయ్యారు.వారు వస్తారని తెలిసి ముందుగానే పక్కాగా ప్లాన్ చేసి.. కిడ్నాప్ చేసి.. చంపేశారు. వారి మృతదేహాలను బాపట్ల జిల్లా సంతమాగులూరు సమీపంలోని ఓ ప్రైవేట్ వెంచర్‌లో పడేశారు. గడ్డం అనిల్‌కుమార్‌రెడ్డి అనే మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి.. సుపారి గ్యాంగులతో ఈ పని చేయించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు

