
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కోరుకొండలో సైనిక్ స్కూల్‌లో హోం స్టేట్ స్టేటస్ కింద తెలంగాణ, ఏపీ విద్యార్థులకు 67% సీట్లున్నాయి. రాష్ట్ర విభజన జరిగి 10 ఏండ్లు పూర్తికావడంతో తెలంగాణకు గల హోం స్టేట్ హోదాను ఉపసంహరించారు. తెలంగాణ విద్యార్థులు ఆలిండియా కోటాలో33శాతం కోటా సీట్లకు పోటీపడాల్సిన పరిస్థితి నెలకొన్నది. తెలంగాణలో కొత్త సైనిక్ స్కూల్ ప్రారంభించే వరకు తెలంగాణ హోం స్టేట్ హోదాను పునరుద్ధరించాలని విద్యాశాఖ కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖకు లేఖ రాసింది.