కోమాలో ఉన్న భర్త వీర్యం కోసం ఓ భార్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తన భర్త 2025 మార్చి నెల నుంచి కోమాలో ఉన్నాడని, భవిష్యత్తులో ఆయన ద్వారా తల్లిని అయ్యేందుకు వీర్యం కావాలని, అందుకు అనుమతి ఇవ్వాలని కోరింది.
వీర్యాన్ని సేకరించి నిలువచేయడానికి భర్త, భార్య ఇద్దరి అంగీకారం అవసరం. ముందస్తు ఆమోదం ఉంటే మరణించిన భర్త నుంచి కూడా వీర్య సేకరణ చేయవచ్చు. కానీ ఈ కేసు భిన్నమైనది కావడంతో క్లిష్టంగా మారింది. కేసు తదుపరి విచారణ గురువారం జరుగనుంది.

