
డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బాణా సంచా పేలుడు తయారీ కేంద్రంలో పేలుడు ఘటనపై కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందింది. బాణా సంచా తయారీ కేంద్రంతో పాటు పేలుడు పదార్ధాలను కూడా అక్కడే నిల్వ ఉంచడం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొన్నారు. బాణా సంచా తయారీలో ఇనుప పరికరాలు వినియోగించటం వల్లే రాపిడికి మంటలు రేగి ఒక్కసారిగా పేలుడు జరిగిందని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు చొప్పున సీఎం చంద్రబాబు నాయుడు పరిహారం అందజేశారు.