ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచకప్ లో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు గురువారం ఢిల్లీలోని రాష్టప్రతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జట్టు సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ.. “మీరు చరిత్ర సృష్టించారు. ఈ విజయం భారత మహిళల శక్తికి ప్రతీక. మీరు యువతకు, ముఖ్యంగా అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచారు” అని పేర్కొన్నారు.

