
భారత డబుల్స్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టిలకు వరుసగా రెండో ఫైనల్లోనూ చుక్కెదురైంది. ఇటీవలే హాంకాంగ్ ఓపెన్ టైటిల్ వేటలో తడబడిన ఈ ద్వయం చైనా మాస్టర్స్ లోనూ కంగుతిన్నది. దక్షిణకొరియాకు చెందిన
టాప్ సీడ్ సియో సూయెంగ్ జే – కిమ్ వొన్ హో జోడీకి బదులివ్వలేక వెండి పతకంతోనే సరిపెట్టుకుంది. ఆదివారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో సాత్విక్ – చిరాగ్ జంట 19-21, 15-21తో ఓటమి పాలైంది.