కొత్త సుప్రీం నాయకుడు మోజ్తాబా ఖమేనీకి మద్దతుగా సోమవారం వేలాది మంది ఇరాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చారు. రాజధాని టెహ్రాన్‌లోని సెంట్రల్ స్క్వేర్‌కు భారీగా తరలివచ్చిన ప్రజలు.. కొత్త సుప్రీం లీడర్‌కు విధేయులమైన ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఇదే సమయంలో ఇరాన్‌పై విస్తృత దాడులు ప్రారంభించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్- అమెరికా వైమానిక దాడుల నడుమే సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే అసెంబ్లీ ఎక్స్‌పర్ట్స్ కౌన్సిల్ రహస్యంగా సమావేశమై.. మోజ్తాబాను పేరును ఖరారు చేసింది.

