పవన్ కల్యాణ్ నయా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడని..వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ ఎలాంటి కొత్త ప్రాజెక్టుల కమిట్మెంట్స్ను తీసుకోవడం లేదు. కొత్త సినిమాలపై వస్తున్న పుకార్లు అవాస్తవం. ఇప్పటికైతే కొత్త సినిమాలను మొదలుపెట్టే ప్లాన్ ఏం లేదు. అలాంటిది ఏదైనా అప్డేట్ ఉంటే అధికారిక ఛానళ్ల ద్వారా మీకు చేరవేస్తాం. ఓజీ 2 విషయంలో ఏదైనా అప్డేట్ ఉంటే సరైన సమయంలో పవన్ కల్యాణ్ స్వయంగా తెలియజేస్తారని పవన్ కల్యాణ్ టీం క్లారిటీ ఇచ్చింది.

