పోలీసు అకాడమీలో పోలీసు అధికారుల రీట్రీట్ కార్యక్రమంలో వివిధ అంశాలపై సీనియర్ పోలీస్ అధికారులు చర్చలు జరిపారు. పోలీసింగ్‌ను మరింత మెరుగుపర్చేందుకు వివిధ అంశాలపై, సాంకేతికత ఆధారంగా పెరుగుతున్న కొత్త తరహా నేరాల గురించి చర్చించారు. టెక్నాలజీలో మార్పుల వల్ల నేరాల స్వభావం కూడా మారిపోయిందని చెప్పారు, భౌతికంగా కనిపించని నేరాలను కనిపెట్టడం సవాళ్లతో కూడుకున్నదని, కొత్త సవాళ్లను ఎదుర్కోవాలంటే పోలీసు అధికారులు అప్‌గ్రేడ్ కావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

