
వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారింది. కొత్త వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో వరుస పిటిషన్లు నమోదవుతున్నాయి. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట మెన్షనింగ్ జరిగింది. ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ సీజేఐ ఎదుట ఆ పిటిషన్లను మెన్షన్ చేశారు. ఈ పిటిషన్లను సాధ్యమైనంత త్వరగా విచారణ చేపట్టాలని రిక్వెస్ట్ చేశారు. ముస్లిం పర్సనల్ లా బోర్డుతో పాటు పలు రాజకీయ పార్టీలు, నేతలు పిటిషన్లు దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా మెన్షనింగ్‌ను పరిశీలిస్తామన్నారు. విచారణకు ఎప్పుడు తీసుకోనున్నారో సీజేఐ నిర్ణయం వెల్లడించనున్నారు.