వైసీపీకి కీలక నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని పై తాజాగా ఏపీ పోలీసులు మరో కేసును నమోదు చేశారు. కేసుకు సంబంధించిన 41 సీఆర్పీసీ నోటీసులను గుడివాడలోని కొడాని నాని ఇంటికి వెళ్లి ఆదివారం అందజేశారు. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబాన్ని కించపరిచేలా నాని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని 2024లో విశాఖ వాసి అంజనాప్రియ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును ఆదారంగా చేసుకుని విశాఖ మూడో టౌన్ పోలీసులు 353(2), 352, 351(4) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

