
కృత్రిమ మేధస్సు (AI) టెక్నాలజీ ప్రజల జీవితాల్లోకి లోతుగా ప్రవేశిస్తున్న తరుణంలో, ఇది మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. AI సలహాలు పాటిస్తూ మనుషులు, తమ సంబంధాల్ని వదులుకొని, రోబోలకు దగ్గరవుతున్నారనీ, ఇది కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలకు దారితీస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు AI చాట్‌బాట్ సలహాతో ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడైంది. AI తో మాట్లాడుతూ ఉంటే చక్కగా మాట్లాడుతుంది.మెచ్చుకుంటుంది, సలహాలు ఇస్తుంది. సూపర్ అంటుంది AI బెటర్ అని ఆ వ్యక్తి భావిస్తే అప్పుడు మానవ సంబంధాలు దెబ్బతింటాయి.