జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద శనివారం అర్థరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక అభయ హనుమాన్ విగ్రహం సమీపంలో బొమ్మల దుకాణంలో మంటలు అంటుకున్నాయి. పెద్ద ఎత్తున మంటల చెలరేగడంతో 32 దుకాణాలు అగ్నికి అహుతిగా మారాయి. ఒక్కో దుకాణంలో రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు బొమ్మలు ఉన్నాయని నిర్వహకులు తెలిపారు. సమ్మక్క-సారలమ్మ జాతర ఉండడంతో పెద్ద మొత్తంలో బొమ్మలు దిగుమతి చేసుకున్నామని వ్యాపారులు చెబుతున్నారు. కోట్లలో ఆస్తి నష్టం జరిగిందని వ్యాపారులు పేర్కొన్నారు.

