
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డ కఠిన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక రేపటి నుంచి అసెంబ్లీలో చర్చకు రానుందని తెలిపారు. ఆ చర్చకు కేసీఆర్ తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ సభకు రాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన తప్పులను ఆయన స్వయంగా అంగీకరించినట్టేనని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.