తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఆయన ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లి పార్టీ అధినేత కేసీఆర్‌తో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. కేటీఆర్‌కు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్న సెక్షన్లు, అవి తీవ్రమైనవేనని.. బీఆర్ఎస్ న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. అయితే కేటీఆర్ విచారణకు హాజరవుతారని ఆ పార్టీ న్యాయవ్యవహారాలు చూసే సోమా భరత్ ప్రకటించారు.

