కేరళ వ్యాప్తంగా 30,495 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన స్వగ్రామమైన పినరయిలోని ఆర్‌సి అమల పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సినీ తారలు మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, ఆయన సతీమణి సుప్రియా మీనన్, ప్రముఖ నటుడు, కేంద్ర మంత్రి సురేష్ గోపి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో ఉన్నారు. మోహన్ లాల్ తిరువనంతపురంలో, పృథ్వీరాజ్ కోచిలో ఓటు వేశారు. సురేష్ గోపీ గురువాయూర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు

