కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఈనెల 22 నుంచి జరగాల్సిన బీటెక్(3,5, 7 సెమిస్టర్లు) పరీక్షలు వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కట్ల రాజేందర్ తెలిపారు. వాయిదా పడిన పరీక్షలు ఈనెల 29 నుంచి జరుగుతాయని, పరీక్షల పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తామని, విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు.