
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన రెండో రోజు బుధవారం కొనసాగింది. ఇందులో భాగంగా ఆయన కేంద్ర యువజన, క్రీడల శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని ఖేలో ఇండియా, జలక్రీడలు, స్టేడియంల అభివృద్ధి, బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాంటి కీలక అంశాలపై సీఎం చంద్రబాబు కేంద్రానికి వివరణాత్మక ప్రతిపాదనలు సమర్పించారు.