
ఉపాధిహామీ పథకం అమలుపై ఆది నుంచీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వం కొత్త కొర్రీలు పెడుతూ నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నది. ఉపాధిహామీలో కొత్త పనులే చేపట్టాలని కేంద్రం నిర్దేశించడంతో పనిదినాల పూర్తిపై రాష్ట్ర సర్కారు మల్లగుల్లాలు పడుతున్నది. పేదలకు ఉపాధినిచ్చి ఆర్థిక, ఆహార సాధికారిత కల్పించాలనే సదుద్దేశంతో చేపట్టిన ఈ పథకం అమలుపై మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. ఇప్పటికే పలుమార్లు పనిదినాలు తగ్గించింది. వేతనాలివ్వడం, పెంపుపై అలక్ష్యం చేస్తున్నది. చేపట్టిన పనులే మళ్లీ చేస్తున్నారనే సాకుతో పాత పనులకు మంగళంపాడింది.