
తన ట్వీట్‌ను ప్రారంభిస్తూ ప్రకాశ్ రాజ్, “మహాప్రభూ, ఓ చిలిపి సందేహం” అంటూ వ్యాఖ్యానించారు. కేంద్రం ప్రవేశపెట్టబోయే కొత్త బిల్లును ఉద్దేశిస్తూ, దాని వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందా అనే ప్రశ్నను లేవనెత్తారు. “మీ మాట వినని మాజీ లేదా ప్రస్తుత ముఖ్యమంత్రిని అరెస్టు చేసి, మీకు నచ్చిన ఉప ముఖ్యమంత్రిని కుర్చీలో కూర్చోబెట్టే యోజన ఏదైనా ఉందా?” అని ఆయన నిలదీశారు.