కాశీనాథుని విశ్వనాథ్ (1930, ఫిబ్రవరి 19 – 2023, ఫిబ్రవరి 2) తెలుగు సినిమా దర్శకులు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి. సినిమారంగంలో చేసిన కృషికిగాను, 1992 లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని, 2016 లో ఆయన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని, పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. కళాతపస్వి ఆయన బిరుదు

