
మాజీ సిఎం, బిఆర్ఎస్ అధినేత కెఆర్తో హరీష్ రావు భేటీ ముగిసింది. కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వరుసగా రెండో రోజు హరీశ్ రావు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కెసిఆర్ తో సమావేశమయ్యారు. గురువారం కెసిఆర్ తో హరీశ్ రావు మూడున్నర గంటల పాటు సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులపైనే ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. నోటీసులు వచ్చాక విషయంపై ఆలోచిద్దామని హరీశ్ కు కెసిఆర్ చెప్పినట్లు సమాచారం.