
మహేంద్ర సింగ్ ధోని గురించి మాట్లాడుకుంటే.. ప్రతిఒక్కరికి మరో పేరు గుర్తొస్తుంది. అదే “కెప్టెన్ కూల్”. మ్యాచ్ పరిస్థితి ఎలా ఉన్నా.. తాను కూల్‌గా, చాలా బాలెన్స్ గా కెప్టెన్సీ చేసేవాడు. అందుకే కెప్టెన్ కూల్ అని అందరూ పిలుస్తారు. తాజాగా ఈ పేరు కోసం ధోని ట్రేడ్‌మార్క్ దరఖాస్తు చేసుకున్నాడు. జూన్ 5న ఈ దరఖాస్తు ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ పదంపై హక్కులను అధికారికంగా పొందాలనుకుంటున్నట్లు ధోని న్యాయవాది ధృవీకరించారు.