
కెనడాలో నాలుగు రోజుల కిందట అదృశ్యమైన భారతీయ విద్యార్థిని వన్షిక కథ విషాదంగా ముగిసింది. ఆమె అనుమానాస్పదంగా మృతిచెందినట్టు ఒట్టావాలోని భారత హైకమిషన్ వెల్లడించింది. వన్షిక మృతికి కారణాలపై స్థానిక పోలీసుల దర్యాప్తు చేస్తున్నారని తెలిపింది. పంజాబ్‌లోని డేరా బస్సి ప్రాంతానికి చెందిన వంశిక… ఆమ్ ఆద్మి పార్టీ నేత, ఎమ్మెల్యే కుల్జీత్ సింగ్ రంధావా అనుచరుడు దేవేందర్ సింగ్ కుమార్తె. వన్షిక మృతదేహాన్ని ఓ బీచ్ వద్ద కనుగొన్నారు. మృతికి కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపాయి..