మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి 9 పేజీల బహిరంగ లేఖ రాశారు. కృష్ణా నది జల వాటాల పునఃపంపిణీపై కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ -2 (KWDT-II) ముందు రాబోయే విచారణల్లో ఆంధ్రప్రదేశ్ హక్కులను కాపాడుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిలో 63 TMC డిపెండబుల్ నీటిని తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్‌ను ట్రిబ్యునల్ అంగీకరిస్తే ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరుగుతుందని జగన్ హెచ్చరించారు.

