ఉత్తరప్రదేశ్ మీరట్ లో రిటైర్డ్ జడ్జీ ఏకైక కూతురును ఆర్మీ మేజర్ కు ఇచ్చి పెళ్లి జరిపించారు. కొన్ని రోజులుగా బాగానే ఉన్న అత్తింటివారు, భర్త వేధింపులు భరించలేని మహిళ పుట్టింటికి వచ్చేసింది. దీనిపై ఫ్యామిలీ కోర్టులో ఎనిమిదేళ్ల పాటు వాదనలు జరిగి విడాకులు మంజురు చేయగా, ఐలవ్ యూ అంటు ప్రింట్ చేసి ఉన్న టీ షర్ట్ ను ధరించి డీజేలు, డ్యాన్స్ లతో తన కూతురిని ఇంటికి తీసుకెళ్లారు. ఆమె బంధువులు, స్నేహితులు కూడా ఈ సెలబ్రేషన్స్ లలో పాల్గొన్నారు.

