పదోసారి బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించిన నితీశ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల భాగస్వామి ఎన్డీయే కూటమి కోసం ‘హోం శాఖ’ను సీఎం వదిలేశారు. రెండు దశాబ్దాలుగా చూసుకున్న హోంను భారతీయ జనతా పార్టీకి సీఎం నితీశ్ అప్పగించారు. ఆయన శుక్రవారం ఉపముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీకి బాధ్యతలు కట్టబెట్టారు. ఈ పరిణామంతో బిహార్లో అత్యధిక సీట్లు గెలుపొందిన బీజేపీ డ్రైవింగ్ సీట్లో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

