ఇరాన్ శుక్రవారం కువైట్ లోని మినా అల్ అహ్మదీ చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్లతో దాడికి దిగింది. ప్రస్తుత పోరు గల్ఫ్‌లోని ఇంధన వ్యవస్థలను దెబ్బతీయడం అంతర్జాతీయంగా చమురు సంక్షోభ తీవ్రతకు దారితీసిన దశలోనే కువైట్‌లోని రిఫైనరీకి భారీ నష్టం సంభవించింది.ప్రతిరోజూ 7,30,00 బ్యారెల్స్ శుద్ధి సామర్థం గల ఈ రిఫైనరీ వరుసగా రెండో రోజు కూడా దాడులకు గురైంది. చమురు సంపన్న గల్ఫ్ దేశం కువైట్‌లో ఉన్న మూడు రిఫైనరీలలో మినా రిఫైనరీ ఒకటి.

