ఏలూరు జిల్లా కలిదిండి ఇందిరా కాలనీకి చెందిన బండి ప్రశాంతి రెండేళ్ల కిందట పని కోసం కువైట్కు వెళ్లింది. సుమారు ఏడాదిన్నర క్రితం ఆమె తల్లిదండ్రులు చనిపోవడంతో స్వదేశానికి వచ్చేందుకు ప్రయత్నించగా అక్కడి ఇంటి యజమానులు నిరాకరించారు. పాస్‌పోర్టు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. ఆమెపై దొంగతనం నేరం మోపి జైలుకు పంపించారు. అక్కడి కోర్టు పూర్తిస్థాయి విచారణ చేసి ఆమెను నిర్దోషిగా విడుదల చేశారు. దీనిపై అక్కడ ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆడియో రికార్డింగ్ చేసి కుటుంబ సభ్యులకు పంపించింది.

