
రాజ్యసభ సభ్యురాలు, దానశీలి సుధా మూర్తి .. కర్నాటక ప్రభుత్వం నిర్వహిస్తున్న కులసర్వేలో పాల్గొనేందుకు నిరాకరించారు. సుధా మూర్తి భర్త, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూడా ఆ సర్వేలో పాల్గొనేందుకు ఆసక్తి చూపలేదు. తామేమీ వెనుకబడిన వర్గానికి చెందినవాళ్లము కాదు అని, అందుకే సర్వేలో పాల్గొనడం లేదని సుధామూర్తి తెలిపారు. సర్వేలో పాల్గొనడం లేదని సుధామూర్తి ప్రత్యేకంగా సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించారు. వ్యక్తిగత కారణాల వల్ల కూడా కులసర్వేలో పాల్గొనడం లేదని ఆమె తెలిపారు.