మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అనుప్పూర్ జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కోట్మా పట్టణంలో శనివారం సాయంత్రం ఓ నాలుగు అంతస్తుల హోటల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు వ్యక్తి మరణించగా.. పలువురు గాయపడ్డారు. ఐదుగురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానంగా ఉందని పోలీసులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

